జాతీయ రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న సమీకరణాలు- ఎన్డీఏ వర్సెస్ ఇండియా - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
Published : Dec 23, 2023, 10:24 PM IST
Prathidhwani: జాతీయ రాజకీయాల్లో కొంతకాలంగా శరవేగంగా మారుతున్నాయి పరిణామాలు. వరసగా 2 సార్లు అధికారంలో కొనసాగుతున్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏను గద్దె దించాలన్న లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత మరింత ఆసక్తిగా మారాయి దిల్లీ రాజకీయ సమీకరణాలు. కాంగ్రెస్ చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో 26 వరకు పార్టీలు ఉండడమే అందుకు కారణం. మరి వారి సమర సన్నాహాలు ఎంత వరకు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ 2 కూటముల బలాబలాలు, సమీకరణాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కమలదళం.. చావోరేవో అంటున్న ఇండియా ముందున్న అవకాశాలు సవాళ్లేంటి? మోదీ 2014లో కాంగ్రెస్ ముక్త భారత్ అని పిలుపిచ్చారు. తగినట్టుగానే కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రం కోల్పోతూ వస్తోంది. ఈసారైనా మోదీ వేవ్‌కు అడ్డుకట్ట వేయకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు? మొత్తంగా చూసినప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.