ప్రతి ఒక్క ఓటర్ని పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం ఎలా? - తెలంగాణలో తొలిసారి వేయనున్న ఓటర్ల సంఖ్య
Published : Nov 17, 2023, 10:48 PM IST
Prathidhwani on Uses of Votes: ఓటు.. ఈసారి వెయ్యకుంటే ఏం జరగదులే.. ఒక్కరం ఓటు వేయ్యకుంటే ఎన్నికలు జరగవా.. ఎన్నికల సమయంలో ఈ తరహా ధోరణులు చేసే నష్టం అంతాఇంతా కాదు. అందుకే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ఓటు ప్రయోజనాలు, అవకాశాలు ప్రజలకు వివరిస్తున్నారు. ఈసారి భారీ సంఖ్యలో నమోదైన యువ ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు రప్పించడానికీ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
Election Commission Awareness Programme on Vote: రాష్ట్రవ్యాప్తంగా ఓటు వినియోగం(Use of vote)పై అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి 10లక్షల మంది ఓటేయనున్నారు. గత ఎన్నికల్లో 29 స్థానాల్లో సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదు అయింది. మరి, ఈసారైనా ఓటర్ విధానం మారుతుందా..? ప్రలోభాలను అధిగమించి ఓటర్ స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేదెలా? పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘంతో పాటు ప్రతిఒక్కరు చేయాల్సిన ప్రయత్నాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.