Prathidhwani క్రికెట్ ప్రపంచకప్‌లో సంచలనాలు.. టీమిండియా జోరు ఎలా ఉండబోతోంది? - తాజా ప్రతిధ్వని
Published : Oct 24, 2023, 10:12 PM IST
Prathidhwani: ఊహించనిరీతిలో క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తున్నాయి వన్డే ప్రపంచకప్ ఫలితాలు. అభిమానుల అంచనాలు మించి రాణిస్తోన్న టీమిండియా, దిగ్గజాలకు షాక్ ఇస్తున్న పసికూనలు, భారీ స్కోర్లు, బౌలర్ల ప్రదర్శనలు.. ఇలా అన్ని అంశాల్లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. వెస్టిండీస్ లాంటి జట్టు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి అర్హత సాధించక పోవడమే ఒకెత్తు అనుకుంటే... పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి ఆ విస్మయాన్ని మరింత పెంచుతోంది డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్. అసలు ప్రపంచకప్.. సంచలనాలు, సమీకరణాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వన్డే క్రికెట్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ప్రపంచకప్ అంటే ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. టీ 20 ఫార్మాట్‌కు ఉన్న ఆకర్షణ, ఐపీఎల్ సహా పలు టోర్నమెంట్‌లు ఎక్కువగా ఆడడం కూడా దీనికి కారణమా? ప్రస్తుతం మ్యాచ్‌ల్లో అందర్నీ ఆశ్చర్య పరుస్తోన్న మరో అంశం దిగ్గజ ప్లేయర్‌ల కీలక ఇన్నింగ్స్‌లు, భారీ స్కోర్లు. పాయింట్ల పట్టికలో ముందున్న అన్నిజట్ల టాప్ ఆర్డర్లు ఇదే జోరు కనబరుస్తున్నాయి.. కారణం ఏమిటి? టైటిల్ వేటలో ఇకపై టీమిండియా జోరు ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.