ఖాతాలో పడినా చేతిలోకి రాని రైతుబంధు సొమ్ము ఆ చిక్కుముడి వీడేదెలా - రైతుబంధు సొమ్ముపై ప్రతిధ్వని డిబేట్
prathidhwani వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని రైతన్నలకు మద్దతుగా నిలిచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం రైతుబంధు. అన్నం పెట్టే రైతన్నలకు పెట్టుబడి సాయంగా ప్రతి సీజన్‌కు ముందే వారి ఖాతాల్లో డబ్బులు వేయడం, అవి అందుకున్న క్షణంలో వారి కళ్లల్లో ఆనందం చూడడం ఈ బృహత్తర పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం వేసిన సాయం మొత్తాలను ఖాతాల్లోనే బిగపడుతున్న బ్యాంకుల తీరు చూస్తే మాత్రం అందుకు అవునూ అనలేని పరిస్థితి. రైతుబంధు సాయమే కాదు ధాన్యం అమ్మిన మొత్తాల్నీ ఇలానే ఆపుతున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధు సాయం రైతుకు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం ఎంత చెబుతున్నా అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎందుకు. ఈ సమస్యను చక్కదిద్దేదెలా. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST