ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం - గత ఎన్నికల కంటే కీలకంగా ఈసారి పోరు!
Published : Nov 15, 2023, 10:13 PM IST
Prathidhwani debate on nomination withdraws :రాష్ట్రంలో హోరాహోరీగా సాగుతోన్న.. ఎన్నికల పోరులో చాలా కీలకమైన నామిషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. ఎటు చూసినా ఎన్నికల కోలాహలమే. ప్రచారహోరులో పార్టీల నాయకుల్ని రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కీలకమైన నామిషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో.. ప్రధానపార్టీలకు రెబెల్స్ బెంగ తగ్గిందనే చెప్పాలి.. కానీ స్వరాష్ట్రంలో గత ఎన్నికల కంటే కీలకంగా ఈసారి పోరు ఉండబోతుందా? గెలుపు-ఓటముల మధ్య స్వల్ప వ్యత్యాసాలే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
స్వతంత్రులు, చిన్నపార్టీల అభ్యర్థుల పాత్రపైనా చర్చ కొనసాగుతోంది. కొన్ని ముఖ్యమైన స్థానాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు.. ప్రధానపార్టీలపై అసంతృప్తుల ప్రభావం ఉండవచ్చునని అంటున్నారు. అక్కడక్కడా నేతల పార్టీల మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి తెలంగాణ ఎన్నికల ఫలితాలను శాసించేది ఎవరని ఊహించడం కష్టమే. ఎన్నికల్లో ఏఏ వర్గాల వారు నిర్ణయాత్మక శక్తి కానున్నారు? ఎలక్షనీరింగ్ లేదా పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో ఏ పార్టీ బలం ఎంత? అసలు దాని ప్రభావం ఫలితాలపై ఎంత శాతం పనిచేస్తుంది? దీనిపై నేటి ప్రతిధ్వని