మిట్టమధ్యాహ్నం ఒంటి కన్నుతో 42 నిమిషాలు సూర్యుడిని చూసి రికార్డ్! - 42 నిమిషాల పాటు త్రాటక ప్రాణాయామ
కర్ణాటకలో ఓ వ్యక్తి 42 నిమిషాలపాటు సూర్యుడిని చూసి రికార్డు సృష్టించాడు. మైసూరు కోటే సమీపంలో రథ సప్తమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బదరీ నారాయణ్ అనే వ్యక్తి ఒంటి కన్నుతో సూర్యుడిని చూశాడు. వరల్డ్ రికార్డును సొంతం చేసుకునేందుకు బదరీ ఈ సాహసం చేశాడు. ప్రపంచ రికార్డు గుర్తింపు పొందేందుకు ఈ త్రాటక ప్రాణాయామ వీడియోను సంబంధిత సంస్థలకు పంపించనున్నాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్నో సాహసాలు చేసి ఇప్పటికే లింక్ అవార్డు, ఆశిష్ట్ వరల్డ్ రికార్డ్, ఎలైట్ వరల్డ్ రికార్డ్‌తో సహా అనేక అవార్డులను పొందాడు బదరీ నారాయణ్. ఇప్పటి వరకు అతడు 1,300 పురాతన ప్రదేశాలలో శీర్షాసన ప్రదర్శనలు చేశాడు. ఈ సాహసాలకు తన తల్లే ఆదర్శమని, గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా కొత్త రికార్డు కోసం ప్రయత్నించినట్లు చెప్పాడు.