రాజ భవనాన్ని తలపిస్తున్న ప్రజా భవన్ - లోపలి దృశ్యాలను చూస్తే వావ్ అనాల్సిందే - Features of Pragati Bhavan
Published : Dec 14, 2023, 10:43 PM IST
|Updated : Dec 14, 2023, 10:51 PM IST
Praja Bhavan official Residence Deputy CM Bhatti Vikramarka : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజా భవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ప్రజాభవన్ లోపలి దృశ్యాలు మొదటిసారిగా బయటికొచ్చాయి. అందులోని విశాలమైన గదులు, సౌకర్యాలు రాజ భవనాన్ని తలపిస్తున్నాయి. లోపల భవనమంతా లైటింగ్‌తో మిరమిట్లు గొలుపుతోంది.
Praja Bhavan Inner View : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజాభవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. దాని ముందున్న గ్రిల్స్, బారికేడ్లను తొలగించి ప్రజలకు ప్రవేశం కల్పిస్తూ ప్రజావాణిని నిర్వహించింది. అనంతరం ఉప ముఖ్యమంత్రికి అధికార నివాసంగా కేటాయిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.
ప్రజా భవన్(ప్రగతి భవన్)ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసంగా ఉపయోగించారు. దీనిని సకల సౌకర్యాలతో నిర్మించారు. 2016 మార్చిలో ప్రగతిభవన్ నిర్మాణాన్ని ప్రారంభించగా అదే సంవత్సరం నవంబర్‌లో పూర్తయ్యింది. అప్పట్లో ప్రగతిభవన్‌లో సామాన్య ప్రజలెవరికీ ప్రవేశం ఉండేది కాదు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉండేది. దాంతో ప్రజాభవన్ లోపలి దృశ్యాలు ఇప్పటి వరకు సామాన్య ప్రజలెవరూ చూడలేదు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా వావ్ అంటున్నారు.