తెలంగాణ

telangana

Praggnanandhaa Chess : ప్రజ్ఞానందకు చెన్నై వాసుల గ్రాండ్​ వెలకమ్.. సంప్రదాయ నృత్యం, డప్పులతో..

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 12:01 PM IST

ప్రజ్ఞానందకు చెన్నై వాసుల గ్రాండ్​ వెలకమ్

Praggnanandhaa Chess : ఇటీవలే జరిగిన ప్రపంచ చెస్​ ఛాంపియన్​షిప్​లో రన్నరప్​గా నిలిచిన గ్రాండ్ మాస్టర్​ ఆర్​ ప్రజ్ఞానందకు చెన్నై ప్రజలు ఘన స్వాగతం పలికారు. అతని రాకకు ముందే విమానాశ్రయానికి చేరుకున్న జనం.. బొకేలతో వెల్​కమ్​ చెప్పేందుకు సిద్ధమైపోయారు. ఇక అక్కడి జనంతో పాటు ప్రజ్ఞానందను చూసేందుకు అతని స్కూల్​ మేట్స్​ కూడా విమానాశ్రయానికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. మేళ తాళాలు, సాంస్కృతిక నృత్యాలతో అతనికి గ్రాండ్​ వెలకమ్​ చెప్పారు.

Praggnandaa Grand Welcome : ప్రజలు చూపించిన అభిమానం పట్ల ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా తనని ఆదరించడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు ప్రజ్ఞానంద ఇంటి వద్ద కూడా పండగ వాతావరణం నెలకొంది. తన రాకకై ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణను హోర్డింగ్​లు, స్వాగత తోరణాలతో ముస్తాబు చేశారు.  

Praggnanandhaa Next Tournament :బాకు వేదికగా జరిగిన ఫిడే చెస్​ ప్రపంచ ఛాంపియన్​షిప్ ఫైనల్​లో మాగ్నస్ కార్ల్​సన్​పై ఓటమిపాలై ప్రజ్ఞానంద రన్నరప్​గా నిలిచాడు. అయినా 18 ఏళ్ల వయసులోనే ప్రజ్ఞానంద పోరాడిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దిగ్గజ చేసే ప్లేయర్​ కార్ల్​సన్​తో హోరాహోరీగా పోరాడిన ప్రజ్ఞానందను అందరూ మెచ్చుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details