లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి - Kotha Prabhakar Reddy Resigned As MP
Published : Dec 13, 2023, 2:03 PM IST
Kotha Prabhakar Reddy Resigned As MP : లోక్‌సభ సభ్యుడిగా బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు సమర్పించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీగా తాను ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి పనులు, 10 ఏళ్లు గా పార్లమెంట్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు గెలిచారు. 2014, 2019లో మెదక్ ఎంపీగా గెలిచిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రత్యర్థి రఘునందన్ రావుపై గెలుపొందారు. ఎమ్మెల్యే, ఎంపీ రెండింటో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొనగా పార్లమెంటు సభ్యత్వానికి వదులుకున్నారు.