తెలంగాణ

telangana

Employees Protest in Husnabad

ETV Bharat / videos

'మా ఓటు వినియోగంపై ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు' - సిద్దిపేటలో పోస్టల్ బ్యాలెట్ సమస్య

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 5:44 PM IST

Postal Ballot Issue in Siddipet: పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కును వినియోగించకోకుండా ఎన్నికల అధికారులు నియంతృత ధోరణిలో ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగస్తులు ధర్నా చేపట్టారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్​లో ఉద్యోగస్తులు ఓటు వినియోగించుకునేందుకు(Use of vote) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్(Postal Ballot Issue)​ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని అకారణంగా ఎన్నికల అధికారులు మూసేయడంతో స్థానిక ఉద్యోగస్తులు ఆందోళనకు దిగారు.

Employees Protest in Husnabad: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వినియోగిస్తున్నారని.. సిద్దిపేట జిల్లాలో మాత్రం ఓటు ఉపయోగించుకోకుండా ఎన్నికల అధికారులు ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ హుస్నాబాద్ - కరీంనగర్ రహదారిపై ధర్నా చేశారు. కాంగ్రెస్​ నాయకులు వారికి మద్దతు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ప్రభుత్వం, ఎన్నికల అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆర్జీఓతో ఫోన్​లో మాట్లాడారు. అనంతరం ఆర్జీవో హామీ మేరకు ఉద్యోగులు ధర్నాను విరమించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details