తెలంగాణ

telangana

Ponnam Prabhakar

ETV Bharat / videos

Ponnam Fires on BRS Govt : 'రైతు వేదికల ద్వారా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి' - Telangana latest politics

By

Published : Jul 17, 2023, 5:10 PM IST

Ponnam Prabhakar Fires On BRS : రైతు వేదికల ద్వారా రైతు రుణమాఫీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సూచించారు. తెలంగాణలో డ్రిప్‌ ఇరిగేషన్ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. జగిత్యాల జిల్లాకు ఇరిగేషన్ పరంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత విద్యుత్‌ ఉత్పాదన ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన.. సబ్‌ స్టేషన్‌ల వద్ద లాగ్ బుక్‌ ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లిక్కర్ మీద ఉన్న ఆసక్తి వ్యవసాయం మీద లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేటీఆర్‌కు వ్యవసాయం గురించి ఏం తెలియదని.. ఆయనకు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏం తెలియవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని చూసి బీఆర్‌ఎస్‌ నేతలు భయపడుతున్నారని అన్నారు. తమ పార్టీపై మాటల దాడి చేసేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.   

ABOUT THE AUTHOR

...view details