ఉచిత కరెంటు ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి - పొంగులేటి శ్రీనివాసరెడ్డి లెటెస్ట్ న్యూస్
Published : Nov 28, 2023, 9:53 AM IST
Ponguleti SrinivasaReddy Interview : రాష్ట్రంలో రాబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ప్రచార కమిటీ కో ఛైర్మన్ , పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 70కి పైగా స్థానాల్లో గెలిచి ప్రభుత్వం కొలువు దీరుతుందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. అందుకే కాంగ్రెస్ ప్రచారానికి జనం ప్రభంజనంలా వస్తున్నారని వెల్లడించారు.
Ponguleti Fires On KCR :ఉచిత కరెంటుపై కేసీఆర్, కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఉచిత కరెంటు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటుందని .. బీఆర్ఎస్ పాలన నియంత, హిట్లర్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. అధిష్ఠానం సూచన మేరకే తామంతా నడుచుకుంటామని వెల్లడించారు. తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన తనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ముఖాముఖి.