తెలంగాణ

telangana

Ponguleti Srinivasa Reddy

ETV Bharat / videos

ఖమ్మంలో పొంగులేటి పర్యటన - లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు అందజేత - Ponguleti latest news

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 7:12 PM IST

Ponguleti Srinivasa Reddy Visited Khammam District : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు.  మంత్రితో తమ సమస్యలను తెలపడానికి కాలనీవాసులు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ జంటను మంత్రి ఆశీర్వదించారు. నియోజకవర్గంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను అందించారు. లబ్ధిదారులతో పొంగులేటి కాసేపు ముచ్చటించారు.

Ponguleti Presents Kalyanalakshmi Checks : ఈ కార్యక్రమంలో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటలకు సాగునీరు కావాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో, వారితో మాట్లాడిన ఆయన ఎప్పుడు నీరు కావాలో చెపితే అధికారులతో మాట్లాడి నీరు ఇప్పించే ప్రయత్నం చేస్తానని రైతులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details