కేసీఆర్ చెంప చెళ్లుమనేలా- కాంగ్రెస్ పార్టీ పక్షానే ప్రజల ప్రయాణం : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 12, 2023, 8:39 PM IST
Ponguleti Srinivas Reddy Fires on CM KCR :తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకునే కేసీఆర్ చెంపచెళ్లు మనిపించే విధంగా.. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ప్రయాణం చేస్తున్నారని పాలేరు అభ్యర్థి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
Telangana Election Polls 2023 :అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి మూడున్నరవేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. నిరుద్యోగులకు అండగా దీక్ష చేశారన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దని, కాంగ్రెస్‌కు నష్టం జరగొద్దనే మంచి మనసుతో.. హస్తం పార్టీకి మద్దతు ఇవ్వడం హర్షణీయమని వివరించారు. పక్క పార్టీ గురించి కానీ పక్క నాయకుడి గురించి కానీ ఆలోచించని ఈ రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని షర్మిల ఆలోచించారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.