నా కార్యకర్తలను బీఆర్ఎస్ ఇబ్బందులు పెడుతుంటే కన్నీరు పెట్టుకున్నా : పొంగులేటి - Ponguleti in Khammam
Published : Jan 10, 2024, 2:39 PM IST
Ponguleti Emotional In Khammam Programme :ఖమ్మంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను గత ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే ఒంటరిగా చాలా సార్లు కన్నీరు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. కష్ట పడకుండా ఏది రాదన్నారు. తాను పడ్డ కష్టం ఊరికే పోలేదు అని తెలిపారు. ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది. ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుట్టుకతో ఎవరు ధనవంతులుగా, పదవులతో పుట్టారని గుర్తు చేశారు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మంచితనం మనకు శ్రీరామరక్షగా ఉంటుందని తెలిపారు.
Ponguleti Emotional In Bhakta Ramadas Kalakshetra : ఆనాాడు కష్షాన్ని దిగమింగుకొని ఈరోజు అందరి ముందు భావోద్వేగానికి గురవ్వడంలో అర్థం ఉందన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో ఓ గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గవద్దని యువతకు సూచించిన మంత్రి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు.