గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటరునాడి ఎలా ఉంది? - ప్రతిధ్వని
Published : Nov 22, 2023, 9:38 PM IST
Political Parties Focus on Greater Hyderabad : ఎన్నికల ప్రచారం చివరి వారానికి వచ్చేసింది. అభ్యర్థులు స్థానికంగా, అగ్రనేతలు రాష్ట్రమంతా సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఐతే ఎన్నికల రాజకీయాలు రాష్ట్రమంతా ఎలా ఉన్నా రాజధాని హైదరాబాద్‌లో మాత్రం పూర్తి విభిన్నమే. కారణం... వైవిధ్యభరితమైన సమీకరణాలే. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వలస జీవులకు కూడా కేంద్రం కావడమే. మినీ భారత్‌గా పిలిచే హైదరాబాద్‌లో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారు లక్షల్లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు రాజధాని పరిధిలోని మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల భవితను నిర్ణయించనున్నారు.
Telangana Assembly Elections 2023 : 29 నియోజకవర్గాల్లో సగానికి పైగా వాటిలో ఇతర ప్రాంతాల ఓటర్లే విజయావకాశాలపై ప్రభావం చూపించనున్నారు. అందుకే వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఆయా ప్రాంతాల నుంచి నేతలను రప్పించి ఆ ఓటర్లతో మాట్లాడిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుంచి పలు పార్టీల నేతలు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వస్తుండటం విశేషం. మరి ఇక్కడి ఓటరునాడి ఎలా ఉంది? స్థానిక సమస్యలపై వలస జీవుల మనోగతమేంటి? వీరిని ప్రసన్నం చేసుకునే విషయంలో పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.