తెలంగాణ

telangana

Election Officials Seized 700 Sarees in Mancherial

ETV Bharat / videos

Police Seized 700 Sarees in Mancherial : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ యత్నం.. మంచిర్యాలలో 700 చీరలు సీజ్ చేసిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 2:48 PM IST

Police Seized 700 Sarees in Mancherial : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఓవైపు.. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. మద్యం, డబ్బు సరఫరాను నియంత్రించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా  మంచిర్యాల జిల్లా  బీజేపీ జిల్లా అధ్యక్షుడు నివాసంలో పోలీసులు, ఎన్నికల నిర్వహణ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. 

Police Seized Sarees at BJP Leaders Residence in Mancherial :ఎన్నికల నియమావళికి విరుద్దంగా చీరలు పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారనే సమాచారంతో పోలీసులు, ఎన్నికల అధికారులతో కలిసి బీజేపీ నేత రఘునాథ రావు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 700 చీరలను గుర్తించారు. మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ చీరలు పంపిణీ చేయనున్నారని భావించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. 

ఈ ఘటనపై మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ ముందే చీరల్ని పంపిణీ చేశామని, ఈ చీరల పంపిణీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో కూడా సోదాలు చేయాలని రఘునాథరావు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

ABOUT THE AUTHOR

...view details