టమాటా ట్రేలలో రూ.80లక్షల గంజాయి - గుట్టురట్టు చేసిన పోలీసులు - 300kgs Ganja Seized
Published : Jan 8, 2024, 2:54 PM IST
Police Seized 300kgs Ganja in Nagarjuna Sagar :రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో గంజాయి మాఫియా సరికొత్త ట్రిక్ ఉపయోగించింది. పుష్ప మూవీ వచ్చాక నిషేధిత మత్తు పదార్ధాలు తరలింపునకు దుండగులు కొత్త మార్గం వెతికారు. అయితే ఆ ప్లాన్ కాస్త పోలీసుల నిఘాతో బెడిసికొట్టింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఆదివారం అర్ధరాత్రి ఎపీ సరిహద్దు పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద ఖాళీ టమాటా ట్రేలను తరలిస్తున్న డీసీఎంను పోలీసులు తనిఖీ చేశారు.
Nagarjuna Sagar Ganja News : తనిఖీలో టమాటా ట్రేలలో తరలిస్తున్న సుమారు 300 కిలోల గంజాయిని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు 168 ప్యాకెట్లలో ఈ గంజాయి తరలిస్తుండగా పట్టుబడినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్ పోలీసులు తెలిపారు.