'సికింద్రాబాద్' ఘటన సీసీ ఫుటేజీ విడుదల - Secunderabad rooby lodge fire accident update
Secunderabad Fire Accident CCTV footage: 8 మంది దుర్మరణం చెంది.. 9 మంది అస్వస్థతకు గురైన సికింద్రాబాద్ రూబీ లాడ్జ్ అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే బ్యాటరీ పేలుడు వల్లే పొగ వ్యాపించిందని పోలీసులు వెల్లడించారు. బ్యాటరీల నుంచి పొగ 5వ అంతస్థులోకి వ్యాపించిందన్నారు. పొగ వల్ల లాడ్జి గదుల్లో 8 మంది మృతి చెందగా, 9 మంది అస్వస్థతకు గురైనట్లు వివరించారు. షోరూమ్ యజమాని సుమీత్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST