తెలంగాణ

telangana

Police Attack On Spa Centre in Banjara Hills

ETV Bharat / videos

Police raids On Spa : బంజారాహిల్స్​లో స్పా సెంటర్​పై టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడి - బంజారాహిల్స్​ మసాజ్​ సెంటర్​

By

Published : Jun 27, 2023, 1:52 PM IST

Police raids On Spa Hyderabad : మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్​పై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది విటులను, 10 మంది యువతలను ఆదుపులోకి తీసుకుని బంజారాహిల్స్​ పోలీసులకు అప్పగించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్10 లోని కార్వీ ఎదురుగా ఓ అపార్ట్‌మెంట్‌లో పర్పుల్‌ నేచురల్‌ హెల్త్‌ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్‌ ఉల్​హక్‌ కలిసి స్పా సెంటర్‌ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. క్రాస్‌ మసాజ్‌, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా టాస్క్​ఫోర్స్​ పోలీసులకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం (ఈ నెల 25న) రాత్రి దాడి చేసి.. నిర్వాహకులు శృతి, రమణ, జాహెద్‌ ఉల్‌ హక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించి.. యువతులను సైతం రెస్క్యూహోంకు తరలించారు. ఈ మేరకు 18 మంది విటులను కోర్టులో హాజరుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details