తెలంగాణ

telangana

Fake Iphone Accessories in Hyderabad

ETV Bharat / videos

Fake Iphone Accessories in Hyderabad : హైదరాబాద్​లో ఐఫోన్ విడిభాగాలు కొంటున్నారా.. అయితే జాగ్రత్త... - హైదారాబాద్​ సెంట్రల్​ జోన్​ టాస్క్​ఫోర్స్​

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 7:12 PM IST

Fake Iphone Accessories in Hyderabad :నగరంలో నకిలీ ఐ ఫోన్ల విడిభాగాలు విక్రయిస్తున్న సెల్‌ఫోన్ దుకాణాలపై.. హైదరాబాద్ సెంట్రల్​ జోన్​ టాస్క్​ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. అబిడ్స్, దోమల్​గూడ పోలీసులతో కలిసి తనిఖీలు చేసిన టాస్క్​ఫోర్స్ బృందం.. నలుగురిని అరెస్ట్ చేశారు. 

Police Raids on Fake Iphone Accessories Shops :సెంట్రల్​జోన్‌ టాస్క్​ఫోర్స్ పోలీసులు, అబిడ్స్, దోమల్​గూడ పోలీసులతో కలిసి.. జగదీశ్​ మార్కెట్​లోని జై రాజేశ్వర్ మొబైల్ స్టోర్స్, న్యూ కలెక్షన్ మొబైల్‌ స్టోర్స్, పీఎస్ టెలికాం మొబైల్స్, హిమాయత్​నగర్​లోని ట్రినిటి మొబైల్స్​లో సోదాలు నిర్వహించారు. సదరు తనిఖీల్లో ఐఫోన్‌ బ్యాక్ కవర్లు,1675 నకిలీ యాపిల్ లోగోలు, ఛార్జింగ్​ అడాప్టర్లు, ఇయర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ సహా ఐఫోన్ కి సంబంధిచిన పలు విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అసలైన విడిభాగాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details