ఐపీఎల్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్.. అదే కారణం
సోమవారం జరిగిన ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్‌పై గుజరాత్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఫిజికల్ టికెట్స్ ఉన్నవారిని మాత్రమే మైదానం లోపలికి అనుమతించారంటూ.. ఈ-టికెట్స్ వారికి పర్మిషన్ ఇవ్వట్లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి స్టేడియం బయటే ఆందోళనకు దిగారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. అయినా వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేసిన అభిమానులపై లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్ సమయంలో జనం మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలోకి అనుమతించే క్రమంలో స్టేడియం బయట ఈ ఘటన జరిగింది. చివరకు స్టేడియం గేట్లను తెరిచి అందరినీ మైదానంలోకి అనుమతించారు అధికారులు. కాగా, ఈ సీజన్లో చివరి మ్యాచ్ కావడం వల్ల ప్రజలు భారీగా ఎత్తున తరలివచ్చారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్ 16 చివరి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. బలమైన జట్లైన సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఐదోసారి చెన్నై టైటిల్‌ను ముద్దాడింది. దీంతో వరుసగా రెండోసారి కూడా ట్రోపీను చేజిక్కించుకోవాలనుకున్న గుజరాత్ నిరాశతో వెనుదిరిగింది.