తెలంగాణ

telangana

Police Flag March in Hyderabad

ETV Bharat / videos

ప్రజలు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించాలని నగరంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - హైదరాబాద్​లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 10:57 PM IST

Police Flag March in Hyderabad : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. సౌత్​ వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్​ను నిర్వహించారు. టపాచబుత్ర, కుల్సుంపుర పోలీస్​ స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఈ మార్చ్​ను నిర్వహించారు. ఇందులో 150 మంది కేంద్ర పోలీసు బలగాలు పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. 

అందుకే ఈ ఫ్లాగ్ మార్చ్​ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినట్లు సమాచారం అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వివిధ నియోజక వర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన కోసం పోలీసులు బైక్​ ర్యాలీలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details