పుష్ప మూవీ తరహాలో ఎర్ర చందనం తరలింపు - పోలీసులకు చిక్కిన యూపీ స్మగ్లర్ల ముఠా - ఎస్ఓటీ పోలీసులు
Published : Dec 28, 2023, 7:58 PM IST
Police arrested Red Sandal Smugglers : ఎర్రచందనం స్మగ్లింగ్ వెండి తెరపై చూసే ఔరా అనుకున్నాం. నిజంగానే స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఎర్రచంద్రాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ ముఠా సభ్యులను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరంతా యూపీకి చెందిన వారిగా గుర్తించారు. డీసీఎం వాహనానంలో కొబ్బరి బోండాల మధ్యలో 101 ఎర్రచందనం దుంగలను దాచి తరలిస్తున్నారు. చిత్తూరు నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను పక్కా సమాచారంతో వలవేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
Police Arrest Sandalwood smugglers :చిత్తూరు నుంచి విజయవాడ, సూర్యాపేట, కోదాడ మీదుగా హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి నాగ్‌పూర్‌కు తరలించేందుకు ప్రణాళిక రచించుకున్నారు. వీరి ప్లాన్ గురించి పోలీసులకు ఉప్పందడంతో కాపుకాసి డీసీఎంను తనిఖీ చేయగా 3 టన్నుల ఎర్రచందన దుంగలు బయటపడ్డాయి. ఎర్రచందనంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆటవీ శాఖాధికారులకు మేడ్చల్ ఎస్‌వోటీ పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన ఆటవీ శాఖాధికారులు దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం ఏ గ్రేడ్‌కు చెందినవని పరిశీలిస్తున్నారు.