Podu Land Pattas : రాష్ట్రంలో రేపు పోడు పట్టాల పంపిణీ - తెలంగాణలో పోడు పట్టాలు పంపిణీ
Podu Land Pattas Distribution in telangana :పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రోజున ఆసిఫాబాద్‌లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఈ విషయాన్ని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రోజున పోడు పట్టాల పంపిణీపై మంత్రి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోడు హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 3 లక్షల 8 వేల ఎకరాలను పంపిణీ చేస్తే.. రేపు 4 లక్షల 6 వేల ఎకరాలను పంపిణీ చేస్తామన్నారు. ఇంత మందిని భూ యజమానులుగా చేయడం చరిత్రలో గొప్ప విషయమని గిరిజనుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాఠోడ్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు పోడు పట్టాలను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేస్తారు. మహబూబాబాద్‌లో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాఠోడ్‌లు పట్టాల పంపిణీ ప్రారంభిస్తారు. అంతే కాక మహబూబాబాద్‌లో రూ.50 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.