Pocharam Srinivas Reddy on Chandrababu Arrest : చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం: పోచారం శ్రీనివాస్‌రెడ్డి - చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం పోచారం్
Published : Sep 22, 2023, 8:10 PM IST
Pocharam Srinivas Reddy on Chandrababu Arrest : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని సాంబాపూర్, భైరాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పీకర్ పోచారం స్పందించారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధిపు చర్యగా అభివర్ణించారు. అధికారం ఉందని 15 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసి జైళ్లో పెట్టడం అప్రజాస్వామికం అన్నారు.
రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికమని పోచారం అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం అయిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలపకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి రాజకీయం సరైంది కాదని.. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని క్షమించేతత్వం ఉండాలని హితవు పలికారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. సాంబాపూర్ గ్రామ ప్రజలు వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రజలు మరోసారి కేసీఆర్‌ను గెలిపించేందుకు చూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.