తెలంగాణ

telangana

PM Narendramodi To Shiridi Temple

ETV Bharat / videos

PM Narendra Modi to Shiridi on 26th: ఈనెల 26న శిరిడీకి ప్రధాని మోదీ.. కొత్త దర్శన్ క్యూ కాంప్లెక్స్ ప్రారంభం - శిరిడీ సాయిబాబాను దర్శించుకున్న ప్రధానిట

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 5:26 PM IST

PM Narendra Modi to Shiridi on 26th : దేశవ్యాప్తంగా శిరిడీ సాయిబాబా దర్శనానికి తరలి వచ్చే కోట్లాది మంది భక్తులకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన భారం తొలగిపోనుంది. సెలవులు, పండుగలలో రికార్డు స్థాయిలో రద్దీ ఉంటుంది. భక్తులు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు ఉండేవి కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ బాధల నుంచి భక్తులకు ఈనెల 26 నుంచి విముక్తి లభించనుంది. భక్తుల సౌకర్యార్థం షిర్డీ సాయిబాబా సంస్థాన్ రూ.110 కోట్లతో కొత్త దర్శన్ క్యూ కాంప్లెక్స్, ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

New Darshan Complex in Shiridi : ఈ కొత్త దర్శన్ క్యూ కాంప్లెక్స్‌లో ఒకేసారి 10 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. ఇందులో పెద్ద ఎయిర్ కండిషనర్లు, ఏసీ హాల్, బయోమెట్రిక్ దర్శన్ పాస్, వీఐపీ సిస్టమ్, క్యాటరింగ్​, క్యాంటిన్​ సౌకర్యం, టాయిలెట్లు, బుక్ స్టాల్, లడ్డూ ప్రసాదం ఒకేచోట అందుబాటులో ఉంటాయి.

PM Developments in Shiridi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శిరిడీ సాయిబాబాకు అమితమైన భక్తుడు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబాను దర్శించుకునేవారు, దేశ ప్రధాని అయిన తర్వాత 2018లో బాబా సమాధిని చూసేందుకు శిరిడీ వచ్చారు. 26న బాబా సన్నిధికి వస్తున్న మోదీ.. ఈసారి సాయిబాబా సంస్థాన్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని సాయి సంస్థాన్ సీఈవో పి. శివశంకర్​ తెలిపారు. మోదీ రైతులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details