తెలంగాణ

telangana

PM Modi witnessed of mega Bihu dance performed by 11,000 participants

ETV Bharat / videos

11వేల మందితో నృత్య ప్రదర్శన.. వీక్షించిన మోదీ.. గిన్నిస్ బుక్​లో చోటు - అసోం బిహు డ్యాన్స్​ గిన్నిస్​ బుక్​

By

Published : Apr 14, 2023, 9:40 PM IST

అసోంలోని గువాహటిలో జరిగిన భారీ నృత్యప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ తిలకించారు. 11,000 మందికి పైగా పాల్గొన్న మెగా బిహు నృత్యాన్ని మోదీ వీక్షించారు. ఒకేసారి 11,304 మంది జానపద నృత్యకారులు.. సంప్రదాయ బిహు డాన్స్ చేశారు. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా.. నృత్యకారులు ఈ నాట్యం చేశారు. నృత్యానికి ముందు ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు రంగోలి బిహు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నృత్య ప్రదర్శన మరపురానిదంటూ కొనియాడారు. అయితే ఈ మెగా బిహు నృత్యం గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. మోదీ సమక్షంలో అసోం ముఖ్యమంత్రి.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ అధికారుల నుంచి సర్టిఫికెట్​ అందుకున్నారు.

అయితే గువాహటిలో గురువారం రాత్రి కూడా ఈ భారీ నృత్య ప్రదర్శన జరిగింది. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ సమక్షంలో సరుసజై స్టేడియంలో వైభవంగా ఈ నృత్య వేడుక సాగింది. ఈ కార్యక్రమంలో గాయకులు తమ పాటలతో అలరించారు. ధోల్, తాల్, గోగోనా, టోకా, పెపా, జుతులి వంటి ఇతర వాయిద్యాలను కళాకారులు వాయించారు. ఈ మెగా ఈవెంట్‌కు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టీస్ సెషన్లు నడిచాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కళాకారులు, నిర్వాహకులు తీవ్రంగా శ్రమించారు. అసోం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిపే లక్ష్యంతో ఈ వేడుక జరిగింది. కార్యక్రమానికి ముందు మాట్లాడిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. ఒకే వేదికపై భారీ బిహు డాన్స్​ పదర్శన చేసి.. జానపద నృత్యం విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్​​ వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details