వందే భారత్ రైలు.. సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దామా..! - telangana latest news
vande bharat train : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నేడు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు కేవలం నాలుగు స్టాపులతో ఎనిమిది గంటల్లోనే తిరుపతికి చేరుకోనుంది. పూర్తిగా అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన వందే భారత్ రైలులో సాధారణ చేర్కారితో సహా ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు కూడా ఉన్నాయి. రొటేషనల్ కుర్చీలతో ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. రూ.16 వందల నుంచి రూ.3 వేల మధ్యలో వందే భారత్ టికెట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అత్యాధునిక సాంకేతికలతో పూర్తి ఏసీతో ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్కు సంబంధించి లోకో పైలట్లతో ప్రత్యేక ముఖాముఖి.
తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణం అందించే ఉద్దేశంతో రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన.. ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు.