9లక్షలు 9వేల సార్లు మోదీ పేరు రాసిన పెద్దాయన- కారణం స్వార్థమేనట! - 9లక్షల9వేల సార్లు మోదీ పేరు
Published : Jan 12, 2024, 5:47 PM IST
PM Modi Fan Shatrughan Baranwal : కూర్చుని శ్రద్ధగా రాసుకుంటున్న ఈయన పేరు శత్రుజ్ఞ బరన్వాల్. వయసు 68 ఏళ్లు. ఉత్తర్ప్రదేశ్ అమేఠీ వాసి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శత్రుజ్ఞ వీరాభిమాని. అందుకే మోదీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాశారు.
"మోదీ పేరును నేను 9 లక్షల 9 వేల సార్లు రాశాను. ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. ఆయన వ్యక్తిత్వం నాకు ఎంతగానో నచ్చింది. నా దృష్టిలో దేవుడు తర్వాత ఆయనే. దేశానికి, సమాజానికి, మన మతానికి ఆయన ఎంతో సేవ చేశారు. అయోధ్యలో రామాలయం కట్టిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్నారు. ఆయనను నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నా." అని మోదీ అభిమాని శత్రుజ్ఞ బరన్వాల్ తెలిపారు.
మోదీ పేరును లక్షల సార్లు రాయడం వెనుక స్వార్థం ఉందని చెబుతున్నారు శత్రుజ్ఞ. ప్రధాన మంత్రిని నేరుగా కలవాలన్నది ఆయన కోరికట. మోదీ పేరును ఇలా లక్షలాది సార్లు రాస్తే ఆయన్ను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు శత్రుజ్ఞ బరన్వాల్.