తెలంగాణ

telangana

టెక్స్‌టైల్ పార్క్

ETV Bharat / videos

​ నేతన్నల ఆశలు... టైక్స్​టైల్​ పార్క్​ వైపు చూపులు - pm mithra maga textile parks

By

Published : Mar 18, 2023, 10:30 PM IST

Prathidwani: రాష్ట్రానికి మెగా టెక్స్‌టైల్ పార్క్​ను కేంద్రం ప్రకటించింది. తెలంగాణతోపాటు మరో 6రాష్ట్రాలకు మెగా టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. తెలంగాణలో మెగా స్థాయిలో వరంగల్‌ పార్క్‌ అభివృద్ధికి అవకాశం కల్పించారు. 5ఎఫ్‌ విధానంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటుకానున్నాయి. ఫామ్‌-ఫైబర్‌-ఫ్యాక్టరీ-ఫ్యాషన్‌-ఫారిన్‌ సూత్రంతో ముందుకు రానున్నాయి. రూ.కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు సృష్టి లక్ష్యంగా వీటిని ఏర్పాటుచేయనున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం తెలంగాణలోని వరంగల్‌లో ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నెలకొల్పి ఇందుకోసం పెట్టుబడి రాయితీ కేంద్రప్రభుత్వం ఇవ్వనుంది. ప్రతిపార్కులో లక్ష ప్రత్యక్ష, 2 లక్షల పరోక్ష ఉద్యోగాలు రానున్నాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా జౌళీరంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పేరుతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జీఐ ట్యాగ్‌ కలిగిన ఎన్నో చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణకు ఈ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ రాకతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ఈ కొత్త హోదా కల్పనతో రాష్ట్రంలోని నేతన్నలు, రైతులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details