తెలంగాణ

telangana

Playing Cricket In Dhoti

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 11:33 AM IST

ETV Bharat / videos

ధోతీ కట్టుకొని క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంటరీ- గెలిచిన జట్టుకు అయోధ్య దర్శనం

Playing Cricket In Dhoti : మధ్యప్రదేశ్​లో వినూత్న క్రికెట్ టోర్నీ జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించి క్రికెట్ ఆడారు ప్లేయర్లు. ధోతీ, కుర్తా, లుంగీలు ధరించి క్రికెట్ ఆడారు యువకులు. భోపాల్​కు చెందిన మహర్షి మైత్రి మ్యాచ్ టోర్నమెంట్ ఈ వినూత్న పోటీలు నిర్వహించింది. శుక్రవారం ఈ టోర్నీ ప్రారంభమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లంతా ధోతి, కుర్తా, లుంగీలో కనిపించారు. మ్యాచ్​కు తగ్గట్టు కామెంటరీ సైతం వినూత్నంగానే సాగింది. ప్లేయర్లు ఆడుతుండగా సంస్కృతంలో కామెంటరీ చెప్పించారు నిర్వాహకులు. మొత్తంగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. గెలిచిన టీమ్​కు బంపర్ ఆఫర్​ను సైతం ప్రకటించారు నిర్వాహకులు. విజేతగా నిలిచే జట్టులోని సభ్యులను అయోధ్య రాముడి దర్శనానికి తీసుకెళ్తామని ప్రకటించింది.

'మన సంస్కృతికి ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహించాం. ఈసారి గెలిచిన టీమ్​ను అయోధ్యకు తీసుకెళ్తాం. వేద బ్రాహ్మణులంతా ఈ టోర్నీలో పాల్గొన్నారు. మ్యాన్ ఆఫ్​ ది టోర్నమెంట్​గా నిలిచిన వ్యక్తికి శతాబ్ది పంచాంగం పుస్తకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం. మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యే ప్లేయర్లకు భగవద్గీత, పురాణ, ఇతిహాస పుస్తకాలను ఇస్తాం' అని నిర్వాహక కమిటీ ఛైర్మన్ అభిషేక్ దుబె తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details