ఫ్లైఓవర్ కింద ఇరుక్కున్న విమానం! హైవేపై ట్రాఫిక్ జామ్- చివరకు ఏమైందంటే? - బ్రిడ్జి కింద ప్లేన్
Published : Dec 29, 2023, 10:40 PM IST
Plane Stuck Under Bridge :విమానాన్ని మోసుకెళ్తున్న లారీ ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. బిహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముంబయి నుంచి అసోంకు విమానాన్ని తీసుకొని వెళ్తున్న ట్రక్కు పిప్రాకోఠి వద్ద ఫ్లైఓవర్ కింద ఇరుక్కుంది. విమానం పైభాగం వంతెనకు తాకడం వల్ల లారీ ఆగిపోయింది. వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. ఫలితంగా 28వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవాల్సి వచ్చింది. విమానం ఇరుక్కుందన్న విషయాన్ని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ముంబయిలో నిర్వహించిన వేలంలో ఓ వ్యాపారి ఈ విమానాన్ని తుక్కు కింద కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని ముంబయి నుంచి అసోంకు పెద్ద ట్రక్కులో తరలిస్తున్నారు. వంతెన ఇరుక్కున్న విషయం తెలిసి పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ట్రక్కును చాకచక్యంగా బయటకు తీశారు. టైర్లలో కొంతమేర గాలిని తీసేసి లారీని వంతెన కింది నుంచి తీయగలిగారు. రహదారిపై ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేసినట్లు పిప్రాకోఠి పోలీస్ స్టేషన్ హెడ్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.
వంతెన కింద విమానం.. ఏం జరిగిందంటే?
అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం- నీటిలో తేలుతూ!