తెలంగాణ

telangana

పెళ్లి కూతురికి సూపర్​ సర్​ప్రైజ్ ఇచ్చిన వరుడు.. హెలికాప్టర్​లో ఏడు రౌండ్ల చక్కర్లు

ETV Bharat / videos

పెళ్లి కూతురికి సర్​ప్రైజ్ ఇచ్చిన వరుడు.. హెలికాప్టర్​లో ఏడు రౌండ్ల చక్కర్లు - భార్యతో కలిసి హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టిన భర్త

By

Published : Feb 9, 2023, 8:19 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

పెళ్లి కూతురికి వరుడు సూపర్​ సర్​ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లి అనంతరం నేరుగా భార్యతో కలిసి హెలికాప్టర్​ ఎక్కాడు. ఏడు రౌండ్ల పాటు గాలిలో చక్కర్లు కొట్టాడు. ఏడుజన్మలు కలిసుంటానని భార్యకు ప్రమాణం చేశాడు. ఆ తరువాత పెళ్లి కూతురితో కలిసి హెలికాప్టర్​లోనే ఇంటికెళ్లాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యానికి గురై.. ఆనందం వ్యక్తం చేశారు. కాగా వధూవరులిద్దరూ పైలెట్లే కావడం గమనార్హం. ఉత్తర్​ప్రదేశ్​కు బులంద్‌షహర్ జిల్లా​కు చెందిన లోకేంద్ర ప్రతాప్​.. మేరఠ్​ జిల్లాకు యషాంసీ రాణాని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది. లోకేంద్ర ప్రతాప్​ ఆస్ట్రేలియాలో పైలట్​ కాగా.. యషాంసీ రాణా కమర్షియల్​ పైలట్​గా పనిచేస్తోంది.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details