తెలంగాణ

telangana

wines Death

ETV Bharat / videos

Viral Video : మద్యం సేవించడానికని వైన్స్​కు వెళ్లి.. అనుమానాస్పద స్థితిలో మృతి - హైదరాబాద్​ వార్తలు

By

Published : Jul 4, 2023, 1:53 PM IST

మద్యం సేవించడానికని వెళ్లిన వ్యక్తి ఇంటికి శవమై వచ్చాడు. ఊహించని పరిణామంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నాచారంలోని కనకదుర్గ వైన్స్‌లో మద్యం సేవించడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సాయంత్రం సుమారుగా 4 గంటల ప్రాంతంలో తన భర్త మద్యం తాగడానికి వైన్స్‌కు వెళ్లాడని.. అక్కడ ఏం జరిగిందో తెలియదని.. ఆ తర్వాత శవమై కనిపించాడని మృతుడి భార్య ఆరోపించింది. రోజూ బ్యాండ్‌ కొడుతూ జీవనం సాగించే తమ కుటుంబానికి ఇప్పుడు ఏ ఆధారం లేదంటూ కన్నీటి పర్యంతమైంది. నిన్న రాత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. షాపు యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. మద్యం షాపు యాజమాన్యం మాత్రం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నాగిని బయట పడవేశామని.. అంతకు మించి తమకు ఏమీ తెలియదని చెబుతోంది.

ABOUT THE AUTHOR

...view details