తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోడ్డు దాటేందుకు జేసీబీ.. సీఎం సొంత నియోజకవర్గంలోనే - జేసీబీతో రోడ్డు దాటుతున్న ప్రజలు

By

Published : Aug 1, 2022, 4:47 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

హిమాచల్​ప్రదేశ్​లో వర్షాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో వాగులు పొంగిపోర్లతుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సిరాజ్​లోని బలిచౌకి ప్రాంతంలో రోడ్డు దాటాడానికి జేసీబీని ఉపయోగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం రావడం వల్ల వాగు ఒక్కసారిగా ఉప్పొంగి నీరు రోడ్డు పైకి వచ్చింది. దీంతో జేసీబీ సహాయంతో రోడ్డును దాటుతున్నారు ప్రజలు. ఇక్కడ వంతెన నిర్మాణం ప్రారంభమైనా.. కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details