తెలంగాణ

telangana

Penganga

ETV Bharat / videos

Three Persons Trapped in Pen Ganga River : గంగపుత్రులను కాపాడిన టైరు.. అసలేం జరిగిందంటే..?

By

Published : Jul 22, 2023, 4:16 PM IST

Three Persons Trapped in Pen Ganga River Video : పెన్‌ గంగా నదిలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను టైరు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం వడూర్‌ సమీపంలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. వరద ప్రవాహానికి పెన్‌ గంగా నదిలో కొట్టుకుపోతున్న పడవను కాపాడటానికి ఓ గంగపుత్రుడు నదిలో దిగాడు. పడవను ఒడ్డుకు చేర్చే క్రమంలో వరద నీటిలోనే చిక్కుకున్నాడు. దీంతో అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు నీటిలోకి దిగారు. ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో ముగ్గురూ నీటిలోనే చిక్కికుపోయారు.

విషయం తెలుసుకున్న ఆ ఏరియా ఎస్సై రాధిక హుటాహుటిన నది వద్దకు చేరుకున్నారు. ఇతర గంగపుత్రుల సహాయంతో ఓ పెద్ద టైరుకు తాడు కట్టించి.. నదిలో చిక్కుకున్న ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురు.. ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉద్ధృతి దృష్ట్యా గ్రామస్థులెవరూ నది వైపు వెళ్లవద్దని ఎస్సై సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details