Pawan Tweet: ఏపీ పాఠశాల విద్యలో బైజూస్ యాప్‌ను చూపించి ప్రభుత్వం మోసం చేస్తోంది: జనసేన అధినేత - వైసీపీ పాలనలో బైజూస్ యాప్‌పై పవన్ ట్వీట్
Pawan Tweet on YCP Govt: పాఠశాల విద్యలో బైజూస్ యాప్‌ను చూపించి వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బైజూస్ యాప్ ద్వారా ఏదో సాధించామని ప్రభుత్వం చెబుతోందని పవన్ అన్నారు. ఆర్భాటాలు కాదు.. పాఠశాల్లో మరుగుదొడ్లు నిర్మించండంటూ వైసీపీ సర్కారును ఎద్దేవా చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఊసే లేదని జనసేనాని పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టలేదని, వారికి శిక్షణ కూడా ఇవ్వటంలేదని ధ్వజమెత్తారు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కు మాత్రం కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇస్తున్నారని ఆరోపించారు. టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి..? టెండర్లలో నిర్దేశిత ప్రమాణాలను ప్రభుత్వం పాటించిందా..? ఆ కంపెనీలను ఎవరు పరిశీలించారు..? వాటి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచారా..? అని పవన్ ప్రశ్నించారు. టెండర్, కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.