తెలంగాణ

telangana

Pawan Kalyan Will Meet Chandrababu in Rajamahendravaram Jail Tomorrow: రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 5:24 PM IST

Pawan Kalyan Will Meet Chandrababu in Rajamahendravaram Jail Tomorrow

Pawan Kalyan Will Meet Chandrababu in Rajamahendravaram Jail Tomorrow: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అక్రమంగా అరెస్టైన  తెలుగుదేశం అధినేత చంద్రబాబును గురువారం రాజమహేంద్రవరం జైల్లో పవన్ కల్యాణ్ కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు.. చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా  పలు పార్టీలు టీడీపీ చేపట్టిన బంద్​కు సంఘీభావం తెలిపాయి. మరికొన్ని పార్టీలు ప్రభుత్వం తీరుకు నిరసనగా.. చంద్రబాబు అరెస్ట్​ను ఖండిస్తూ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(  Pawan Kalyan) చంద్రబాబు అరెస్ట్​పై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్​ను మెుదటి నుంచి ఖండిస్తూ వస్తున్న జనసేన అధినేత గురువారం చంద్రబాబును కలవనున్నారు.  రాజమహేంద్రవరం(Rajamahendravaram) జైలుకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ ములాఖత్ ద్వారా చంద్రబాబును కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో జనసేన అధినేత  పవన్ కల్యాణ్​పై వైసీపీ ప్రభుత్వం  వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్​పై వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంఘీభావంగా... ఆయనను కలిసి దైర్యం చెప్పిన నేపథ్యంలో... నేడు జనసేన టీడీపీకి మద్ధత్తుగా నిలబడాలని నిశ్చయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

Rajinikanth Phone Call to Lokesh : తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్​ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్... ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

చంద్రబాబును కలిసిన లూథ్రా... తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లారు. ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసి న్యాయస్థానంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వివరించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details