Pawan Kalyan Silver Picture జనసేనుడికి అభిమానుల అరుదైన జన్మదిన కానుక.. వెండి నగలతో పవన్ భారీ చిత్రం - నెల్లూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
Published : Sep 1, 2023, 1:01 PM IST
Pawan Kalyan Silver Picture: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినాన్ని( సెప్టెంబరు 2) పురస్కరించుకొని 470కేజీల వెండితో ఆయన చిత్ర రూపం తీర్చిదిద్దారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో తమిళనాడులోని సేలంలో ఈ కళాకృతిని రూపొందించారు. నలుగురు కళాకారులు తమ నైపుణ్యంతో 18 గంటల పాటు శ్రమించి.. వెండి పట్టీలు, కడియాలతో దీన్ని తయారు చేశారు. వినూత్న రీతిలో పవన్‌కు జన్మదిన కానుకను అందించి సుజయ్ బాబు.. పవన్‌పై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు, సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. నీ క్రేజ్‌ను మేచ్ చేయటం అంత ఈజీకాదు పవనన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.