Pawan Kalyan Meets Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరిని పరామర్శించిన పవన్ కల్యాణ్.. 'బాబుతో నేను' అంటూ భరోసా... - వైసీపీ అశంపై జగన్
Published : Sep 14, 2023, 3:44 PM IST
|Updated : Sep 14, 2023, 4:58 PM IST
Pawan Kalyan Meets Nara Bhuvaneshwari: జైల్లో ములాఖత్ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును చూసి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుని ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉంది... ఇబ్బంది పడుతున్నారా అని పవన్ అడిగారు. ప్రభుత్వ రాక్షసత్వంపై, జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కొద్ది సేపు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అనంతరం క్యాంప్ సైట్లో నారా భువనేశ్వరి ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. అమ్మా ఎలా ఉన్నారు అంటూ పవన్ అడిగగారు... క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచినందుకు పవన్ కు భువనేశ్వరి (Nara Bhuvaneshwari ) ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాలకు దూరంగా ఉండే మీపై నాడు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని పవన్ భువనేశ్వరి కి చెప్పారు. వైసీపీ భువనేశ్వరిని దూషించిన విధానం, అవమానించిన విధానం ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరే మహిళా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధైర్యంగా ఉండాలని.. ప్రజలు మన వైపే ఉన్నారని పవన్ భువనేశ్వరికి చెప్పారు. పవన్ కు వీడ్కోలు పలికేందుకు లోకేశ్ ఎయిర్ పోర్టుకు బయలుదేరగా, తాను వెళతానని.... అమ్మ వద్ద ఉండు అంటూ లోకేశ్ ను వారించారు. కారు వద్దకు వచ్చి కౌగలించుకుని పవన్ కు ధన్యవాలు చెప్పి లోకేశ్ వీడ్కోలు పలికారు.