Pawan Kalyan: 'తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్సీపీ క్షమాపణ చెప్పాలి' - Pawan Kalyan fires on YSRCP
Pawan Kalyan fires on YSRCP: తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్సీపీ క్షమాపణ చెప్పాలని... జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై.. వైఎస్సాఆర్సీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. హరీశ్‌రావుకు సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజలను ఆ పార్టీ నేతలు తిట్టడం సరికాదన్నారు. పాలకుల వ్యాఖ్యలను ప్రజలకు ఆపాదించకూడదని స్పష్టం చేశారు.
వైఎస్సాఆర్సీపీ నాయకులందరికీ హైదరాబాద్‌లో వ్యాపారాలున్నాయని.. అలాంటప్పుడు ఇక్కడి ప్రజల్ని ఎలా తిడతారని పవన్ ప్రశ్నించారు. అదుపుతప్పి మాట్లాడే నాయకులను మందలించాల్సిన బాధ్యత సీఎంకు, మంత్రులకు ఉందని జనసేనాని అన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
అయితే ఇటీవల మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై వైఎస్సాఆర్సీపీ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే బిడ్ వేస్తామన్నా హరీశ్‌రావు వ్యాఖ్యలపై మాట్లాడిన మంత్రి అప్పలరాజు... కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.