తెలంగాణ

telangana

Patient Treatment On Rickshaw

ETV Bharat / videos

Patient Treatment On Rickshaw Viral Video : రిక్షాపై ఆస్పత్రికి రోగి.. ఆరుబయటే వైద్యుడి చికిత్స.. - తోపుడు బండిపై రోగికి చికిత్స

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 4:14 PM IST

Patient Treatment On Rickshaw Viral Video : ఉత్తర్​ప్రదేశ్​లోని జౌన్‌పుర్ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగికి రిక్షాపై చికిత్స అందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. మఛ్లీ నగరంలోని కజియానా ప్రాంతానికి చెందిన కలియా(55) అనే వ్యక్తి ఉన్నట్టుండి ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడి కుమారుడు సంతోశ్​తో పాటు మిగతా బంధువులు రోగిని రిక్షాపై సమీపంలో ఉన్న సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. 

అయితే రోగిని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లకుండా ఆరుబయటే రిక్షాపైనే వైద్యుడు చికిత్స అందించారు. పరిస్థితి విషమించటం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించమని చెప్పారు. అందుకు కనీసం అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేయలేదు. అయితే ఆరుబయటే వైద్యుడు చికిత్స చేయడం వల్ల సీహెచ్​సీ నిర్లక్ష్య వైఖరి బయటపడింది. 

వైరల్​ అయిన వీడియోపై అడిషనల్ సీఎంవో డాక్టర్ రాజీవ్ స్పందించారు. వీడియో తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పూర్తి సమాచారాన్ని సీఎస్​సీ సూపరింటెండెంట్ నుంచి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details