రైలులో మొబైల్ చోరీ చేసిన యువకుడిని బయటకు తోసేసి హత్య
ఉత్తర్ ప్రదేశ్ బరేలిలో దారుణం జరిగింది. రైలులో మొబైల్ చోరీ చేశాడని ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు ప్రయాణికులు. అతడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అనంతరం ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా తోటి ప్రయానికులు ఘటనను అడ్డుకోవడం మానేసి వారు సహకరిస్తున్నట్లు వీడియోలో అర్థమవుతోంది. బరేలి- న్యూదిల్లీ మధ్య నడుస్తున్న అయోధ్య ఎక్స్ప్రెస్లో ఘటన జరిగింది. యువకుడిని కొట్టిన వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వారు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST