నేతల సిత్రాలు.. యాదాద్రి ఆలయ సందర్శనలో మునుగోడు ఓటర్లు.! - మునుగోడు ఓటర్లు యాదగిరి దర్శనం
రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు పడ్డారు. ఆలయాలలో ఉచిత దర్శనాలు కల్పిస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామస్థులు దర్శించుకున్నారు. సుమారు 800 మంది యాదాద్రి ఆలయానికి వెళ్లారు. మునుగోడుకు సంబంధించిన ఈ ఓటర్లని హయత్ నగర్ 1 డిపోలకు చెందిన 15 బస్సులలో యాదగిరిగుట్టకి నాయకులు తరలించారు. హయత్ నగర్ 1డిపో ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఓటర్లను ఆలయ అధికారులు కొండపైకి అనుమతించారు. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఓటర్లను యాదాద్రికి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ సంఖ్యలో తరలిరావటంతో ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. ఈ రోజు ప్రత్యేకంగా 12 బస్సుల్లో వచ్చిన వారందరికీ కూడా అక్కడే భోజన వసతులు కల్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST