తెలంగాణ

telangana

palakurthi mla interview

ETV Bharat / videos

రాజకీయాల్లో నాకూ రోల్​ మోడల్​ ఉన్నారు - అదే నా లక్ష్యం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి - ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటర్వ్యూ

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 7:57 PM IST

Palakurthi MLA Yashaswini Reddy Interview : శాసనసభ ఎన్నిక ఫలితాలు తెలిసినప్పుడు తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని నూతనంగా ఎన్నికైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. ఇది తన గెలుపు కాదని మొత్తం పాలకుర్తి ప్రజల గెలుపని చెప్పారు. ఈ గెలుపు కోసం ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారన్నారు. అలాగే పాలకుర్తిలో కాంగ్రెస్​ జెండా ఎగరాలని కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అందరి కష్టానికి ఫలితమే ఇక్కడ కాంగ్రెస్​ జెండా ఎగిరిందన్నారు. రాజకీయాల్లోకి వస్తానని తాను ఏ రోజూ అనుకోలేదని పేర్కొన్నారు. 

Palakurthi MLA Interview : 'మా అత్తమ్మకు ఇక్కడ టికెట్​ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆమెకు సభ్యత్వం అడ్డు రావడంతో నన్ను పోటీ చేయమని చెప్పారు. పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తనను పోటీ చేయించారు. మొదటిలో పోటీ చేయాలంటే భయమేసింది. కానీ రాజకీయంలోకి దిగిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదనిపించింది. రాజకీయంలో తనకంటూ ఒకరు రోల్​ మోడల్​గా ఉన్నారు. పాలకుర్తిని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతూ సంక్షేమ పథకాలను అందిస్తా'నంటున్న యంగ్​ ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details