Padma Rao Variety Campaign in Telangana : ప్రచారంలో నయా ట్రెండ్ రీల్స్‌తో ఓటర్లను ఆకట్టుకుంటున్న పద్మారావు గౌడ్ - బీఆర్ఎస్ వెరైటీ ఎన్నికల ప్రచారం
Published : Nov 1, 2023, 2:01 PM IST
Padma Rao Variety Campaign in Telangana 2023 : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తూ.. తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షాలకు భిన్నంగా మైకులలో ఎక్కువ సేపు ప్రచారాలు చేయకుండా క్యాచీ స్లోగన్స్‌తో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఈ వరుసలో అందరికంటే ముందుండగా.. ఇతర బీఆర్ఎస్ అభ్యర్థులు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
Padma Rao Catchy Slogans In Election Campaign : తాజాగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ పద్మారావు వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. 'వార్తలు చదవాలంటే కావాలి న్యూస్ రీడర్.. సికింద్రాబాద్ డెవలప్ కావాలంటే రావాలి మాస్ లీడర్..' అంటూ క్యాచీ స్లోగన్స్‌తో పద్మారావు గౌడ్ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రచారంలో ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ ప్రజలకు మరింత చేరువవుతూ ప్రచారంలో నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు పద్మారావు గౌడ్. ఒకప్పుడు తెలంగాణ ఇప్పటి తెలంగాణకు ఉన్న తేడాను వివరిస్తూ ప్రచారం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరూ ఓసారి లుక్కేయండి.