మెదక్ గురించి ఏం తెలుసని ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు : పద్మా దేవేందర్ రెడ్డి - మైనంపల్లిపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆరోపణలు
Published : Nov 11, 2023, 2:14 PM IST
Padma Devender Reddy Slams Mynampally : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు, కరెంట్ ఖతమవుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో జంగరాయి, చందాపూర్, మల్లుపల్లి, రుద్రారం, చందంపేట, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు పార్టీలు గ్రామాలకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ఊరురా తగాదాలు ఎక్కువవుతున్నాయని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. స్వార్థరాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ నుంచి తన కుమారుడిని మెదక్ నియోజకవర్గంలో అభ్యర్థిగా దించారని మండిపడ్డారు. పింఛను కావాలంటే వాళ్లు దిల్లీకి పోవాల్సిన పరిస్థితి ఉందని.. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మనమే పింఛన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందనే విషయం ప్రజలందరూ ఆలోచించాలి కోరారు.