అతివేగంతో వచ్చి కారు బోల్తా.. బైకర్లపైకి దూసుకెళ్లిన వాహనం.. పెట్రోల్ బంక్ సమీపంలోనే.. - uttarpradesh new
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు బోల్తాపడి అక్కడే ఉన్న బైకర్లపైకి దూసుకెళ్లింది. పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే?
శుక్రవారం మధ్యాహ్నం.. తిలా షాహబాజ్పుర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డం వచ్చిన బైక్‌ను తప్పించబోయి కారు బోల్తాపడింది. కారు అప్పటికే అతి వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న యువకులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులతో పాటు కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అదుపుతప్పిన కారు.. పెట్రోల్ బంక్ లోపలకు దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు.