Osmansagar Reservoir Project Water Level : తెరుచుకున్న ఉస్మాన్‌సాగర్ గేట్లు... మూసీలో పెరిగిన వరదప్రవాహం
Osmansagar Reservoir 2 Gates open : ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పొటెత్తింది. ఈ క్రమంలోనే గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. దీంతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 208 క్యుసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. హిమాయత్‌సాగర్‌లో ఇప్పటికే 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు రెండు జలాశయాల గేట్లు ఎత్తడంతో.. మూసీలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహక ప్రాంతాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిషన్‌బాగ్, పురానాపూల్.. ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, డిజాస్టర్ టీంలు, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ క్రమంలోనే హై అలర్ట్ ప్రకటించింది. అవసరం లేకుండా ప్రజలు బయటకు రావద్దని పేర్కొంది. అత్యవసర సాయం కోసం 9000113667 నెంబర్‌కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ వివరించింది.